విభజన చట్టం ప్రకారం.. ఆ జిల్లాల అభివృద్ధికి నిధులివ్వండి : హరీశ్ రావు

-

విభజన చట్టం ప్రకారం తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దిల్లీలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేంద్ర ఆర్థికమంత్రిని ప్రత్యేకంగా అడిగారు. జీఎస్టీ వసూళ్లపై తెలంగాణకు పరిహారం కింద రూ.698.97 కోట్లు తెలంగాణకు రావాల్సి ఉందని స్పష్టం చేశారు. జీఎస్టీ బకాయిలు, ఇతర రాష్ట్రాల పేరుతో నమోదు చేసిన వాణిజ్య సంస్థల పన్ను చెల్లింపుల తీరు గురించి ప్రత్యేకంగా వివరించారు.  వెనుకబడిన జిల్లాల నిధి మూడేళ్లుగా పెండింగ్‌లో ఉందని.. రూ.1,350కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని చెప్పారు. దీనిపై స్పందించిన నిర్మలా సీతారామన్‌ సమస్య పరిష్కారానికి అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు హరీశ్‌రావు తెలిపారు.

మరోవైపు  తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలను సమన్యాయంతో పంపిణీ చేసేందుకు కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని జల్‌శక్తి మంత్రిని హరీశ్‌రావు కోరారు. ఏపీ సర్కార్ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా పోలవరంలో వివిధ విభాగాలను విస్తరిస్తోందని చెప్పారు. హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version