వాహనదారులకు మంత్రి కోమటిరెడ్డి గుడ్‌న్యూస్

-

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాహనదారులకు శుభవార్త చెప్పారు. వార్షిక బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ రోడ్లు , రాష్ట్ర రహదారులకు టోల్‌ విధించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు.రోడ్డు పనులకు టెండర్లు వేసి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం పేమెంట్ కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

ప్రతి నియోజకవర్గంలో మండలాలను అనుసంధానం చేస్తూ ప్రతి గ్రామాలకు మధ్య ఉన్న లింక్ రోడ్లను డబుల్‌ రోడ్లు చేయబోతున్నామన్నారు. గత ప్రభుత్వ పాలకులు రాష్ట్రంలోని రోడ్లను పట్టించుకున్న పాపాన పోలేదని సిరిసిల్ల,సిద్దిపేట, గజ్వేల్‌ సెగ్మెంట్లలోనే రోడ్లు వేశామన్నారు. ఆ మూడు ప్రాంతాల్లోనే కాకుండా..బీఆర్ఎస్ సర్కార్ టైంలో ఎక్కడైనా రోడ్లు వేసినట్లు చూపిస్తే తాము దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news