రేవంత్ రెడ్డికి బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్ బేసిన్‌ల మీద లేదు అని చురకలు అంటించారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి బూతుల గురించి తెలిసినంత ఈజీ కాదు బేసిన్‌ల గురించి తెలుసుకుకోవడం అని ఎద్దేవా చేశారు హరీష్ రావు. రేవంత్ రెడ్డిలో విషయం తక్కువ విషం ఎక్కువ అని మండిపడ్డారు. నీటి కేటాయింపులు, బనకచర్ల ప్రాజెక్టు గురించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు.

రేవంత్ రెడ్డి నల్లమల్ల పులి బిడ్డ కాదు వెకిలి మాటల వెర్రి బిడ్డ అని చురకలు అంటించారు హరీష్ రావు. రేవంత్ రెడ్డికి తగ్గట్లే ఆయన సలహాదారుడు ఆదిత్యనాథ్ ఉన్నాడని చురకలు అంటించారు. నంద్యాలలో ఉన్న బనకచర్ల ప్రాజెక్టును పట్టుకొని ప్రకాశం జిల్లాలో ఉంది అంటాడని ఎద్దేవా చేశారు.