రుణమాఫీపై అసలు లెక్కలు బయటపెట్టారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు. ట్విట్టర్ ( X ) లో హరీష్ రావు స్పందిస్తూ… సాగుకు స్వర్ణయుగం..లక్షకోట్లకు పైగా సంక్షేమమన్నారు. తొమ్మిదిన్నరేళ్ల బిఆర్ఎస్ పాలనలో రైతన్నకు నేరుగా అందించిన ఆర్థికసాయం అంటూ చిట్టా విప్పారు హరీష్ రావు. 69 లక్షల రైతులకు రూ. 72,972 కోట్ల రైతు బంధు అందించామని…. లక్షా 11 వేల మందికి రూ. 6,488 కోట్ల రైతు బీమా ఇచ్చామన్నారు.
రెండు దఫాల్లో రూ. 29,144.61 కోట్ల రుణమాఫీ చేసామని వెల్లడించారు. ఇతర రైతు సంక్షేమ పథకాల కింద రూ.11.401 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. కేవలం ఈ పథకాల ద్వారానే రైతుకు అందిన ఆర్థిక సాయం రూ. 1,20,005 కోట్లు అన్నారు. దేశ చరిత్రలో ఇది ఆల్ టైం రికార్డ్ అంటూ హరీష్ రావు పేర్కొన్నారు. ఇక సంపూర్ణ రుణమాఫీ చేస్తే.. రాజీనామాకు సిద్దమని సవాల్ విసిరారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు.