బంప‌ర్ ఆఫ‌ర్‌.. కేవలం 436/- కే 2 లక్షల బీమా.. ఈ కేంద్ర‌ ప‌థ‌కానికి ఇలా అప్లై చేసుకోండి..

-

దేశంలోని పౌరుల ఆర్థిక, సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం చాలా రకాల పథకాలను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన) కూడా అలాంటి పథకమే.దేశంలోని ప్రతి విభాగం కూడా ఈ బీమా పథకం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందుతుంది. ఈ బీమా పథకం కింద పాలసీని కొనుగోలు చేయడానికి సంవత్సరానికి ఒకసారి కేవలం చాలా తక్కువ మొత్తాన్ని మాత్రమే చెల్లించాలి. దేశంలోని పౌరులు ప్రతి సంవత్సరం చెల్లించి ఈ పాలసీని కొని బీమా ప్రయోజనాలను పొందవచ్చు.

ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) పథకం కింద ఏదైనా కారణం వల్ల పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోతే నామినీకి రూ. 2 లక్షల దాకా బీమా క్లెయిమ్ లభిస్తుంది. జీవన్ జ్యోతి బీమా పాలసీని 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు అప్లై చేసుకోవచ్చు. జీవన్ జ్యోతి బీమా పాలసీ మెచ్యూరిటీ వయస్సు 55 సంవత్సరాలు ఉంటుంది. ఈ టర్మ్ ప్లాన్‌ ను ప్రతి సంవత్సరం కూడా రెన్యూవల్ చేసుకోవాలి. ఒకవేళ ఏ సంవత్సరంలోనైనా ఆ ప్రీమియం డిపాజిట్ చేయకపోతే మీరు బీమా ప్రయోజనంని పొందలేరని గుర్తుంచుకోండి. దాంతో మీ పథకం మూసివేయబడుతుంది.

కానీ ఇందులో ఒక సదుపాయం ఏమిటంటే.. మీరు 55 ఏళ్ల వయస్సు వచ్చే దాకా మీకు కావలసినప్పుడు ఈ పథకంలో ప్రవేశించవచ్చు.ఈ జీవన్ జ్యోతి బీమా పథకం పాలసీని కొనుగోలు చేయడానికి మీరు ప్రతి సంవత్సరం కూడా కేవలం రూ. 436 చెల్లిస్తే సరిపోతుంది. 2022 సంవత్సరానికి ముందు పాలసీని కొనుగోలు చేయడానికి కేవలం రూ.330 మాత్రమే చెల్లించాల్సి ఉండేది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం దీన్ని రూ. 436 కు పెంచింది. ఈ బీమా ప్రీమియం జూన్ 1 నుండి మే 30 దాకా చెల్లుబాటు అవుతుంది.

ఇందులో ఉన్న గొప్పదనం ఏమిటంటే.. ఈ పాలసీని చాలా సులభంగా పొందవచ్చు. మీరు ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌ ని సందర్శించడం ద్వారా లేదా మీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇంట్లో కూర్చొని ఈ పథకంకి సంబంధించిన పాలసీని తీసుకోవచ్చు..ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది మోడీ ప్రభుత్వం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. టర్మ్ ప్లాన్ అంటే బీమా పాలసీ వ్యవధిలో పాలసీదారు కనుక మరణిస్తేనే బీమా కంపెనీ బీమా మొత్తాన్ని చెల్లిస్తుంది. జీవన్ జ్యోతి బీమా యోజన వ్యవధి పూర్తయిన తర్వాత కూడా పాలసీదారు చనిపోకుండా క్షేమంగా ఉంటే, అతనికి ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయం గుర్తుంచుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version