దేవుడి మీద ఒట్టేసి మాట తప్పితే రాష్ట్రానికి అరిష్టం : హరీశ్ రావు

-

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు ఆగస్టు 15, 2024లోపు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే చేశారు. కాకపోతే కొంతమందికి సాంకేతిక సమస్యల కారణంగా రుణమాఫీ చేయలేదు. రూ.2లక్షల కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రం చేయలేదు. దీంతో తాజాగా హరీశ్ రావు యాదాద్రిలో మీడియాతో మాట్లాడారు.

రుణమాఫీ చేయాలని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. దేవుడి మీద ప్రమాణం చేసి సీఎం ప్రజలను మోసం చేశారు. దేవుడి మీద ఒట్టేసి మాట తప్పితే రాష్ట్రానికి అరిష్టం అన్నారు. రుణమాఫీ పై ప్రశ్నిస్తే.. వాగులో దూకమని మాట్లాడారు. ప్రజలనే కాదు.. దేవుళ్లను కూడా ముఖ్యమంత్రి మోసం చేశారు. రుణమాఫీ చేస్తానని దేవుడి మీద ఒట్టేశారు. 20లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారు.  రైతులకు మీరు ఇస్తామని రూ.2లక్షలు ఇచ్చి మీ నిజాయితీ నిరూపించుకోండి. రెండు లక్షల కంటే అధికంగా ఉన్న వారిని చెల్లించాలని చెబుతున్నారు. వారు అప్పులు చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయి. 20లక్షల మంది రైతులకు కూడా పూర్తిగా చేయలేదు. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సింది ఎవరు..? వడ్లకు బోనస్ ఇస్తామని ఇప్పుడు సన్నాలకే అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీదంతా మోసం దగా.. రుణమాఫీ పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు. రేవంత్ సర్కార్ దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. ఎన్నికల్లో ఊరూరికి వెళ్లి ఊదరగొట్టింది గిప్పుడు అమలు చేయాలని కోరుతున్నాం. ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెట్టిండు. తెలంగాణ ప్రజలపై శాపం పడకుండా ప్రజలను కాపాడాలని యాదాద్రి లక్ష్మినరసింహా స్వామికి పూజలు చేసినట్టు తెలిపారు హరీశ్ రావు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version