నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ విడుదల..!

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ మధ్య ఇవాళ మాటల యుద్ధం జరిగింది. అరికెపూడి గాంధీ-కౌశిక్ రెడ్డి సవాళ్లు, ప్రతీ సవాళ్లు జరిగాయి. దీంతో కౌశిక్ రెడ్డి నివాసం పై దాడి చేశారు అరికెపూడి గాంధీ. దీంతో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంతో మొత్తం 19 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరికెపూడి గాంధీతో పాటు నలుగురు కార్పొరేటర్లు.. పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. తాజాగా  పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ స్టేషన్ బెయిల్ పై  నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు.

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్ తదితరులు గాంధీకి సంఘీభావం తెలిపారు. పోలీసులు ఇచ్చిన 41 నోటీసుకు వివరణ ఇచ్చినట్టు గాంధీ తెలిపారు. “నన్ను ఆహ్వానిస్తేనే కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లాను. కానీ, మాపై దాడి చేశారు. కౌశిక్ భార్య విల్లాపై నుంచి కుండీ, మొక్కలు మా కార్యకర్తలపై విసిరేశారు. 40 మంది నన్ను అడ్డుకున్నారు. ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకు కౌశిక్ ప్రయత్నించారు. నన్ను ఆంధ్రా వాడు అన్నారు. అదే బీఆర్ఎస్ విధానమైతే ఆ పార్టీ నాయకత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే పార్టీ అధినేత కేసీఆర్.. కౌశిక్ రెడ్డిని  సస్పెండ్ చేయాలి” అని గాంధీ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version