తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈరోజు వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రతి సవాల్‌తో అరికెపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి నివాసంపై దాడి చేసి పోలీసులు అరెస్టు చేశారు. కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యారు పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ.
ఇదిలా ఉండగా.. కౌశిక్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాపై దాడి చేసి.. మమ్మల్నే అరెస్ట్ చేస్తారా? అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.