కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభను నిర్వహిస్తున్న తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ సభ కౌరవుల సభను తలపిస్తోందని అన్నారు. అయితే అంతిమంగా గెలిచేది పాండవులు.. నిలిచేది ధర్మమేనని వ్యాఖ్యానించారు. అధికారం పక్షం అహంకారంతో చేస్తున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తుందని చెప్పారుయ.
’29 నవంబర్ 2014లో మా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తీర్మానం గురించి కేసీఆరే స్వయంగా ప్రధానికి వివరించారు. ఎస్సీ వర్గీకరణకు ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారు. ఎస్సీ వర్గీకరణ కోసం గతంలో ప్రాణాలు అర్పించారు. గాంధీభవన్ వద్ద ఆత్మాహుతికి పాల్పడితే అప్పటి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. కాంగ్రెస్ వర్గీకరణ చేయట్లేదని మందకృష్ణ నేతృత్వంలో గాంధీ భవన్‌ను ముట్టడించేందుకు వచ్చారు. అమరులైన మాదిగ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. స్కిల్ యూనివర్సిటీకి కూడా బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది.’ హరీశ్ రావు తెలిపారు.