రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేస్తారా? : హరీశ్ రావు

-

రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేస్తారా? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి మాజీ మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రుణమాఫీ కాలేదని అదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన తెలియచేస్తున్న రైతులను అరెస్టులు చేయడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. పోలీసు యాక్ట్ పేరు చెప్పి, జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయొద్దని పోలీసులు హుకుం జారీ చేయడం హక్కులను కాలరాయడమేనని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న రైతులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతులు రుణమాఫీ కాకపోవడంతో కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోతున్నారు. ఏం చేయాలో తెలియక చివరకు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు, అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం రైతుల రుణమాఫీ సమస్యకు పరిష్కారం చూపకుండా, పోలీసులను పురమాయించి గొంతెత్తిన వారిని బెదిరించడం, అణగదొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గం. అని హరీశ్ రావు ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version