ప్రభాకర్ రావును కలిసేందుకు హరీశ్ రావు అమెరికాకు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడని.. ఆయనను కలిసేందుకే హరీష్ రావు అమెరికా వెళ్లారన్నారు. ఇప్పట్లో తెలంగాణకు రావొద్దని చెప్పి వచ్చారని ఆరోపించారు. మే 26న హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లారని.. తిరిగి నిన్న ముంబై మీదుగా హైదరాబాద్ కి చేరుకున్నాడని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఏ ఫ్లైట్లో వెళ్లాడో.. ఎక్కడ కలిశాడో నిరూపిస్తా అన్నారు. ప్రభాకర్ రావును కలవలేదని హరీష్ రావు ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు. తాను దేనికైనా సిద్ధమే అన్నారు. కేసీఆర్ రాక్షసుడు అని ట్యాపింగ్ నీచమైన ఫోన్ ట్యాపింగ్ చేయించారని సీరియస్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version