కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కు లీగల్ నోటీసు ఇస్తానని హెచ్చరించారు హరీశ్‌రావు. ప్రజా సమస్యల పై పోరాడుతున్న నా పై బురద చల్లె వికృత రాజకీయాలకి తెరలేపినట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుకు ఆనంద్ కన్వెన్షన్‌లో వాటాలున్నాయని రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు.హిమాయత్ సాగర్ ఎఫ్‌టీఎల్ భూముల్లో అక్రమంగా ఆనంద్ కన్వెన్షన్‌ని నిర్మించారని పేర్కొన్నారు.
అందులో మాజీ మంత్రి హరీశ్‌కు కూడా వాటాలున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు.అయితే.. దీనిపై హరీష్‌రావు స్పందించారు. ప్రభుత్వం పై వస్తున్న వ్యతిరేకత ను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాల్ని ఆశ్రయిస్తున్నట్లు ఉన్నారని… గోల్కొండ కోట, చార్మినార్ లో కూడా హరీష్ రావు కు వాటాలు ఉన్నాయి అని అంటారేమో? అంటూ సెటైర్లు పేల్చారు. అబ్బద్దపు ప్రచారాలు చేస్తున్నందుకు గాను లీగల్ నోటీస్ పంపుతున్నా..బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అనిల్ ను హెచ్చరిస్తున్నా అంటూ ఆగ్రహించారు హరీష్ రావు.