హరీశ్ రావుకు గంట సమయం ఇచ్చినా సమయం సరిపోలేదు అంటున్నారు అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. అబద్దాలను నిజం అని చెప్పడంలో హరీశ్ రావుకు మేనమామ పోలికలు వచ్చాయి. హరీశ్ రావు ఎన్ని ఏండ్లు కష్టపడినా కేసీఆర్ తరువాత.. కేటీఆర్ సీఎం అవుతాడు. కానీ హరీశ్ రావు కాలేడు. తండ్రి కొడులు వాడుకోవాల్సినంత వాడుకొని వదిలేస్తారు. నాకు మంత్రి పదవీ రాదు అని హరీశ్ అన్నారు. నా మంత్రి పదవి పై నిర్ణయం మా సీఎం, అధిష్టానం తీసుకుంటుంది అని రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు.
అంతకు ముందు హరీశ్ రావు కాళేశ్వరం పై తీసుకున్న నిధులు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ కి మాత్రమే తీసుకోలేదు. పాలమూరు రంగారెడ్డితో పలు ప్రాజెక్టులకు ఉపయోగించారు. రాష్ట్రం అప్పుల కుప్ప అయితే అంతర్జాతీయ సంస్థలు రావు. ప్రజల నిర్ణయం అనేది ఫైనల్. మీ తెలివి తేటలతో నిధులను తీసుకురండి.. కానీ మాపై నెపం నెట్టి తప్పించుకోకండి. మాపై కోపంతో తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయకండి అన్నారు హరీశ్ రావు.