రేవంత్, చంద్రబాబు సమావేశంపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన సహచరుడు చంద్రబాబుతో సంప్రదించి ఆ ఏడు మండలాలు వెనిక్కి తేవాలని కోరుతున్నాం..ఈ ఏడు మండలాలు ఇచ్చిన తరువాతనే మిగతా విభజన అంశంపై చర్చించాలని కోరుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి నాల్లలోనే 7 మండలాలను ఏపీలో కలిపారు.
దానితో లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ ఆ రాష్ట్రానికి వెళ్ళిందని ఆగ్రహించారు. దానిని కేసీఆర్ తీవ్రంగా ఖండించి బందుకు కూడా పిలుపునిచ్చారు..ఆ బిల్లు పెట్టింది బీజేపీ ఐతే ఆమోదించింది కాంగ్రెస్ అన్నారు. భద్రాచలంలో కనీసం భక్తుల పార్కింగ్, డంపింగ్ కు కూడా స్థలం లేని పరిస్థితి ఉందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కి ఓటు వేసినందుకు ఖమ్మం జిల్లాలో చింతకాని మండలంలో ఓ వ్యక్తి వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..ప్రభాకర్ ఆత్మహత్య హృదయ విదారకంగా ఉందన్నారు.