చీమలు పెట్టిన పుట్టలో పాము దూరినట్టు కాంగ్రెస్ లో చేరి సీఎం అయ్యావు.. రేవంత్ పై హరీశ్ సంచలన వ్యాఖ్యలు

-

చీమలు పెట్టిన పుట్టలో పాము దూరినట్టు కాంగ్రెస్ లో చేరి సీఎం అయ్యావు అని  రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి హరీశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినట్టు ఫోజు కొడుతున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తి రైపిల్ రెడ్డి అయ్యాడని.. ఆయన ఏనాడు తెలంగాణ గురించి మాట్లాడలేదన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్షతోనే కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని గుర్తు చేశారు.

అసెంబ్లీలో కీలక చర్చలు జరుగుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సడన్ గా వచ్చి సభను మిస్ గైడ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు లిప్ట్ సాధ్యం కాదని రిటైర్డు ఇంజనీర్లు చెప్పారన్నారు. విద్యుత్ మీటర్ల విషయంలో వ్యవసాయ మోటార్లకు మినహాయింపు అనేది చదవకుండా తప్పుదోవ పట్టించారని.. ఓ ముఖ్యమంత్రి ఇలా చదవడం మంచి పద్దతి కాదన్నారు. పోతిరెడ్డి పాడుకు వ్యతిరేకంగా 2005లో మేము ఆరుగురం మంత్రి పదవులకు రాజీనామాలు చేశామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version