రెండేళ్ల తరువాత తెరుచుకున్న శ్రీశైలం గేట్లు.. 12 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల

-

జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల ఎగువన భారీ వర్షాలు కురవడంతో పెద్ద మొత్తంలో వరద వస్తుంది. దీంతో రెండు ప్రాజెక్టుల నుంచి దాదాపు 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంది. ప్రస్తుతం డ్యాంలో 876 అడుగుల నీటిమట్టం ఉండగా.. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఈ క్రమంలో ఎగువ నుంచి వస్తున్న భారీ వరద డ్యాం పూర్తి స్థాయి సామర్థ్యం కంటే ఎక్కువ ఉంది. దీంతో సోమవారం సాయంత్రం  అధికారులు డ్యాం వద్దకు చేరుకుని నాలుగు గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి విడుదల చేశారు.

శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 180 లకు చేరుకుంది: శ్రీశైలం డ్యామ్ లోని 6,7,8 గేట్లను సుమారు 12 అడుగుల మేత పైకి ఎత్తు ఒక్కో గేటు నుంచి 27 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా డ్యామ్ గేట్లను కర్నూలు చీఫ్ ఇంజనీర్ కబీర్ భాషా అధికారికంగా ఓపెన్ చేశారు

Read more RELATED
Recommended to you

Exit mobile version