తెలంగాణలో HM బదిలీలకు నేడు, రేపు వెబ్‌ ఆప్షన్లు

-

తెలంగాణలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల్లో రోజుకో మార్పు చోటుచేసుకుంటోంది. తాజాగా టీచర్ల బదిలీలు, పదోన్నతుల కాలపట్టికలో పాఠశాల విద్యాశాఖ స్వల్ప మార్పులు చేసింది. గెజిటెడ్‌ హెచ్‌ఎంల బదిలీల కోసం ఈ నెల 15, 16వ తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని తెలిపింది. వారికి 17వ తేదీన బదిలీ ఉత్తర్వులు ఇస్తారని వెల్లడించింది.

గతంలో ప్రకటించిన కాలపట్టిక ప్రకారం.. ఈ ప్రక్రియ ఈ నెల 12, 13 తేదీల్లో పూర్తయి, 15న బదిలీ ఉత్తర్వులివ్వాలి. కానీ ఇటీవల కొందరు హెచ్‌ఎంలు హైకోర్టును ఆశ్రయించడంతోపాటు కటాఫ్‌ తేదీని సెప్టెంబరు 1గా మారుస్తూ గతంలో ఇచ్చిన జీఓను సవరిస్తూ కొత్తది జారీ చేసిన నేపథ్యంలో తేదీలను మార్చాల్సి వచ్చిందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

మరో వైపు గెజిటెడ్‌ హెచ్‌ఎంలుగా పదోన్నతికి అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ)ల సీనియారిటీ జాబితాను ఇవాళ బదిలీల పోర్టల్‌లో ఉంచనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. సీనియారిటీపై అభ్యంతరాలుంటే ఈ నెల 15 నుంచి 17 వరకు తెలపొచ్చని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news