ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడం బీజేపీకి అవసరం కాదు – విజయశాంతి

-

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడం బీజేపీకి అవసరం కాదన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి. నిన్న కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి స్పందించారు. ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ కావాలని కోరుకోవడం రాజకీయంగా బీజేపీకి అవసరం కాదు… ఆ ఆవశ్యకత కూడా లేదన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలలోని ఆయా సమస్యలపై నిర్దేశించబడ్డ ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సీబీఐలు తమ నిర్వహణ చేస్తాయని పేర్కొన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి.

ఎంఐఎం ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత గారు అరెస్ట్ కానట్లయితే… బీజేపీ, బీఆరెస్ ఒక్కటే అన్న భావంతో బీఆరెస్‌కు వ్యతిరేకంగా ఓటు చెయ్యవచ్చన్న భయం బీఆరెస్‌కు ఉందేమో గానీ… జాతీయవాద బీజేపీకి ఆ ఆలోచనా ధోరణి ఉండదని తేల్చి చెప్పారు. గతంలోఒకసారి అప్రూవర్‌గా ఉండి.. మళ్లీ కిలాఫ్‌గా మారి.. తిరిగి ఈ రోజు అప్రూవర్‌గా మారుతున్నోళ్లు బీఆరెస్ ప్రోద్బలంతోనే ఇయ్యన్నీ చేస్తున్నారనే అభిప్రాయం వినవస్తున్నదని వెల్లడించారు. ఇక, ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు… ఆరోపణలున్న ఏ ఆడబిడ్డ అయినా నిర్దోషులుగానే ఎప్పుడూ నిలవాలని మాత్రం వ్యక్తిగతంగా రాములమ్మ ఎన్నటికీ కోరుకుంటాదన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news