సుల్తాన్ పూర్ JNTU ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర సీరియస్ అయ్యారు. మంత్రి ఆదేశాలతో కదిలింది జిల్లా అధికార యంత్రాంగం. JNTU క్యాంపస్ కి వచ్చి విద్యార్థులనడిగి వివరాలు తెలుసుకున్నారు జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి, RDO పాండు. ఫుడ్ లో బల్లులు, బొద్దింకలు, ఎలుకలు వస్తున్నాయని వాపోయారు విద్యార్థులు. కిచెన్ పరిశుభ్రంగా లేకపోవడంతో ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు అడిషనల్ కలెక్టర్ మాధురి.
వంట గదిలో కనీస జాగ్రత్తలు పాటించారా అని ప్రిన్సిపాల్, మెస్ కాంట్రాక్టర్ పై ఫైర్ అయ్యారు. మెస్ కాంట్రాక్టర్ ని మార్చాలని ప్రిన్సిపాల్ కి ఆదేశించారు. విద్యార్థులే కావాలని చట్నీలో వేశారని ప్రిన్సిపాల్ చెప్పగా తినే ఆహారంలో విద్యార్థులు ఎందుకు వేస్తారని నిలదీశారు జిలా అడిషనల్ కలెక్టర్. కాగా, ఈ ఘటన సంగారెడ్డి జేఎన్టీయూ కళాశాల క్యాంటీన్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మూత సరిగా పెట్టకపోవడంతో చట్నీ గిన్నెలో పడిన ఎలుక బయటికెళ్లుందుకు అటు ఇటు పరిగెత్తిన వీడియోలు వైరల్ అయ్యాయి.