6 గ్యారంటీలు అన్నారు మా పార్టీకి చెందిన 6 ఎమ్మెల్యేలను 6 ఎమ్మెల్సీలను తీసుకున్నారని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహించారు. ఇవాళ ఢిల్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం పేరుతో రాహుల్ గాంధీ ఆస్కార్ స్థాయిలో యాక్షన్ చేస్తున్నారు.. యాంటి డిఫెక్షన్లా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు వలసలను ప్రోత్సహించేది కూడా కాంగ్రెస్ పార్టీనే అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ లు అమలు చేస్తామని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.
డిసెంబర్ 9 న రుణ మాఫీ చేస్తామని చెప్పారు…ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేరలేదని నిప్పులు చెరిగారు కేటీఆర్. కాంగ్రెస్ ఆరు గారెంటీలు మర్చిపోయి ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకుంది… రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గోవా, కర్ణాటక లో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని రాహుల్ చెప్పుకుంటూ… ఇప్పుడు తెలంగాణాలో BRS ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు… మణిపూర్ లో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే.. ఆ ఎమ్మెల్యే నీ సుప్రీం కోర్టు డిస్ క్వాలిఫై చేసిందని గుర్తు చేశారు.