ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల జలాశయానికి భారీ వరద

-

ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయం జలకళను సంతరించుకుంది. 81 వేల33 క్యూసెక్‌లన నీరు ఆల్మట్టి ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 65 వేల క్యూసెక్‌ల నీటిని నీటిపారుదల శాఖ అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 519.6 మీటర్లు కాగా.. ప్రస్తుతం 518.11  మీటర్లు ఉంది.

నారాయణపూర్‌ జలాశయంలోకి 55 వేల క్యూసెక్‌ల నీరు చేరుతుండగా ప్రాజెక్టు నుంచి దిగువకు 12 గేట్లు ఎత్తి 37 వేల 260 క్యూసెక్‌ల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 492.25 మీటర్లు కాగా ప్రస్తుతం 491.68 మీటర్లు ఉంది. జూరాల జలాశయానికి 2 వేల500 క్యూసెక్‌ల వరద చేరుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 2 వేల 700 క్యూసెక్‌ల నీటిని దిగువకు పంపిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.663 టీఎంసీలుగా ఉంది. జూరాల జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో అధికారులు జల విద్యుత్ ద్వారా ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జలాశయానికి ఉన్న కుడి, ఎడమల కాలువలతో పాటు.. నెట్టెంపాడు‌ , భీమా ఎత్తిపోతల‌ పథకానికి,‌ సాగు నీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version