రాజాసింగ్ ఇంటి వద్ద భారీగా పోలీస్ బందోబస్తు

-

దూల్ పేట్ లో బిజెపి నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీలో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో రాజాసింగ్ ఇంటి వద్ద పోలీసులు ఈ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. మంగళ్ హాట్ లో ఖాదిర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు రాజసింగ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.

రాజా సింగ్ ని తన ఇంటిి నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. 14వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రాజా సింగ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ తర్వాత రాజా సింగ్ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించింది. 41 సి ఆర్ పి సి కింద నోటీస్ ఇవ్వలేదన్న రాజాసింగ్ లాయర్ల వాదనతో ఏకీభవించింది కోర్టు.

కేసు దర్యాప్తులో పోలీసు అధికారులకు సహకరించాలని న్యాయమూర్తి ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఆదేశించారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుండి ఓ వర్గం ఆందోళనలు ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version