తెలంగాణా ప్రజలకు ALERT.. మూడు రోజులు భారీ వర్షాలు

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తారు… అలాగే ఉత్తర తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Rains in AP and Telangana for next 5 days

ఇటు హైదరాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాలు, అలాగే మహబూబ్నగర్, వికారాబాద్, సూర్యాపేట, నల్లగొండ, నారాయణ పేట, రంగారెడ్డి జిల్లాలతో పాటు మేడ్చల్, మల్కాజ్ గిరి, వరంగల్, ములుగు కొత్తగూడెం జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. ఇక మరికొన్ని జిల్లాలలో తేలికపాటి వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇక ఇటు నిన్న హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ , షేక్పేట్, మణికొండ లాంటి ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version