హైదరాబాద్ లో భారీ వర్షం.. రహదారులు జలమయం

-

భాగ్యనగరంలో వరణుడు దంచికొట్టాడు. ఏకధాటిగా గంటపాటు కురిసిన వర్షానికి ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, సికింద్రాబాద్ ప్రాంతాల్లో బీభత్సమైన వానకు రహదారులన్నీ జలమయమయ్యాయి. చెరువులను తలపించిన రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించింది.

బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, బేగంపేట్‌, చిలకలగూడ, కూకట్‌పల్లి, ఆల్విన్‌కాలనీ, హైదర్‌నగర్, నిజాంపేట్, మూసాపేట్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో నగరవాసులకు గత కొన్ని రోజులుగా ఉన్న వేడి వాతావరణం నుంచి ఉపశమనం లభించింది. జీహెచ్‌ఎంసీ సహాయక బృందాలు, ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగి రహదారులపై చేరిన వర్షం నీటిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.

రేపు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ.. ఎల్లుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కి మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version