ఇకపై సివరేజ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ : మంత్రి పొన్నం

-

ఇకపై సీవరేజ్ ఓవర్ ఫ్లో లేని నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని బీసీ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సరోజినీ దేవి కంటి ఆస్పత్రి వద్ద ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం, సీవరేజ్ పైప్‌లైన్ వ్యర్ధాల తొలగింపు కార్యక్రమాలను ప్రారంభించారు. దీనికి మేయర్ విజయలక్ష్మి, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్, కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి, ఎమ్మేల్యే మాజిద్ హుస్సేన్ హాజరయ్యారు. సరోజిని దేవి కంటి ఆస్పత్రిలో నిర్మించిన ఇంకుడు గుంతను మంత్రి పొన్నం ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ..ఇంకుడు గుంతల నిర్వహణపై డిసెంబర్ 31 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.నగరంలో వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక మురుగునీరు సమస్యలు, నిత్యం పొంగే మ్యాన్ హోళ్లను గుర్తించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మురుగు నీటిని ఎస్‌టీపీల ద్వారా శుభ్రం చేస్తామన్నారు. భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ల సామర్ధ్యం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాలం చెల్లిన పైప్ లైన్ల‌ను తొలగిస్తామన్నారు. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పెండింగ్ పనులను పర్యవేక్షిస్తామన్నారు. సీవరేజ్ సమస్యలను 3 నెలల్లో 30 శాతానికి తగ్గించాలనేది ప్రభుత్వ లక్షమని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version