హైకోర్టు కీల‌క నిర్ణ‌యం.. ఆన్ లైన్‌లోనే విచార‌ణ‌లు

-

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు క‌రోనా వ్యాప్తి పెరుగుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర హై కోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్డుల‌లో ప్ర‌త్యేక్ష విచార‌ణ‌ల‌ను నిలిపి వేసింది. అన్ని కోర్టుల‌లో కేసుల‌ విచార‌ణ‌లు త‌ప్ప‌కుండా ఆన్ లైన్ ప‌ద్ద‌తిలోనే జ‌ర‌గాల‌ని అన్ని జిల్లా న్యాయాధిప‌తులుకు తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఆదేశాల‌ను జారీ చేసింది. వ‌చ్చే నెల 4 వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న‌ అన్ని కోర్టుల‌లో ఆన్ లైన్ లోనే విచార‌ణ సాగాల‌ని రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది.

హై కోర్టు లో కూడా అన్ని బెంచ్ లు ఆన్ లైన్ లోనే కేసుల విచార‌ణ చేపట్టాల‌ని తెలిపింది. ప్ర‌స్తుత స‌మ‌యంలో నెలకొన్న కొవిడ్ ప‌రిస్థితుల దృష్ట్య ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపింది. అలాగే క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విడుద‌ల చేసే మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడా త‌ప్ప‌కుండా అమ‌లు చేయాల‌ని అన్ని జిల్లాల న్యాయాధిప‌తుల‌కు ఆదేశాల‌ను జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version