బీఆర్ఎస్ కి హైకోర్టులో చుక్కెదురు.. 15 రోజుల్లో నల్గొండ పార్టీ ఆఫీస్ కూల్చేయాలని ఆదేశం

-

బీఆర్ఎస్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైందనే చెప్పాలి. 15 రోజుల్లో నల్గొండ జిల్లా  బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశించింది హైకోర్టు. అంతే కాదు.. బీఆర్ఎస్ వేసిన పిటిషన్ ను కొట్టేసింది. దీంతో బీఆర్ఎస్ నేతలకు షాక్ తగిలిందనే చెప్పాలి.

బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ భూమిని అక్రమంగా అక్రమించి ఆఫీస్ నిర్మించారని హైకోర్టులో కేసు వేశారు పలువురు కాంగ్రెస్ నేతలు.  బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ రేకులను విప్పి.. ఆ పార్టీ అధ్యక్షుడి ఇంటి దగ్గర పెట్టేయ్యాలని గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. ఆ తర్వాత పార్టీ భవనాన్ని నేలమట్టం చేసేయ్యాలని అధికారులను ఆదేశించారు. కార్యాలయం స్థలంలో.. సమీప కాలనీలకు మంచినీటి సరఫరా చేసేందుకుగానూ.. 20 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణానికి నివేధిక సిద్ధం చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులకు మంత్రి సూచించారు.  అలాగే స్త్రీ నిధి భవనం కూడా నిర్మించి.. ఆ స్థలంలో పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు.  ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version