జగన్ సొంత జిల్లాలో టీడీపీ స్కెచ్ వేసింది. ఈ మేరకు కడప టిడిపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులోనే హామీలన్నీ ఒకొక్కటి నెరవేరుస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి పేదల పొట్టకొట్టి అన్న క్యాంటిన్లను రద్దు చేశారని తెలిపారు. అన్న క్యాంటిన్ లను తిరిగి ప్రారంభించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడిది…ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 100 క్యాంటిన్ లను ప్రారంభించిందని గుర్తు చేశారు.
ఇక జగన్ ఇలాక కడప, ప్రొద్దుటూరు తో కలిపి రేపు 75 అన్న క్యాంటిన్లు ప్రారంభం కాబోతున్నామని ప్రకటించారు. రాజధాని నిర్మాణం ఒకటి రెండు నెలలో ప్రారంభించి, నాలుగు సంవత్సరాలలో పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు కు 12 వేల 500 కోట్ల రూపాయాల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని వివరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు వాడుకోవడానికి వెసులుబాటు అవుతుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడీ అన్నారు. వైస్సార్సీపీ ప్రభుత్వంలో ఏదేచ్చగా ఇసుక అక్రమ రవాణా జరిగిందని చెప్పుకొచ్చారు. పక్క రాష్ట్రాలకు ఇసుక ను వైస్సార్సిపి నాయకులు మాఫియాలాగా అక్రమ రవాణా చేసి, వేల కొట్ల రూపాయలు దోచుకున్నారని ఆగ్రహించారు.