హైడ్రాకు హై పవర్స్ వచ్చేశాయి. హైడ్రా ఆర్డినెన్స్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇకపై హైడ్రాకు ప్రత్యేక చట్టం అమలులోకి రానుంది. మున్సిపల్ చట్టంలో 374B సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ORR పరిధి వరకు ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు పరిరక్షిస్తూ సర్వాధికారాలు ఇచ్చేలా చట్టం రూపకల్పన చేశారు.
దీని ప్రకారం..జీహెచ్ఎంసీ చట్టం-1955లోని సెక్షన్ 374బీ ప్రకారం ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులివ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం హైడ్రా కు ఉంటుందన్న మాట. తెలంగాణ పురపాలక చట్టం-2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్‌కు ఉన్న అధికారాలు కూడా ఉంటాయి.
తెలంగాణ బీపాస్ చట్టం-2020 ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్ ఫోర్స్, జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్ ఫోర్స్‌కు ఉన్న అధికారాలు….హెచ్ఎండీఏ చట్టం-2008లోని పలు సెక్షన్ల కింద కమిషనర్‌కు ఉన్న అధికారం కూడా ఇప్పుడు ఉంటుందన్న మాట.