నీళ్లు అమ్ముతూ రోజుకు 50 లక్షల రూపాయల పైనే సంపాదిస్తోందట HMWS సంస్థ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాదులో తాగనీటి సమస్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ప్రతి ఒక్కరు వాటర్ ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు.
ఈ తరుణంలోనే వాటర్ ట్యాంకర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. అయితే.. ఈ తరుణంలోనే..నీళ్లు అమ్ముతూ రోజుకు 50 లక్షల రూపాయల పైనే సంపాదిస్తోందట HMWS సంస్థ. హైదరాబాద్ ప్రజల తాగు నీటి అవసరాల కోసం రోజుకు దాదాపు 10 వేల ట్యాంకర్ల నీటిని సరఫరా చేస్తుండగా గృహ అవసరాలకు రూ. 500, కమర్షియల్ అవసరాలకు రూ. 850 ధరలుగా నిర్ణయించారు. గత ప్రభుత్వం ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేసినట్లుగా గృహ అవసరాలకు వాటర్ ట్యాంకర్లను సైతం ఉచితంగా సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.