ఇల్లు లేని వారికి ఇంటి స్థలం.. స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం : భట్టి

-

ఇల్లు లేని వారికి ఇంటి స్థలం.. స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తాజాగా  అసెంబ్లీలో  బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ప్రసంగించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం అందజేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 6,956 నర్సింగ్ ఆఫీసర్లను నియమించాం.. త్వరలోనే ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

మెగా డీఎస్సీ వేయబోతున్నాం.. 15000 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేయబోతున్నాం. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన గ్రూప్ 1 లో 64 అదనపు పోస్టులు జత చేశామని తెలిపారు. పోటీ ప్రపంచంలో రాష్ట్ర విద్యార్థులు నెగ్గుకొచ్చేవిధంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతీ మండలంలో అధునాతన సౌకర్యాలతో వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాలేజీ స్థాయిలో ఉద్యోగానికి అవసరమైన కోర్సులను ప్రవేశపెడతామని తెలిపారు. పైలట్ ప్రాజెక్టు గా వీటి ఏర్పాటుకు రూ.500కోట్లు ఇస్తున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version