తెలంగాణలో వరద ముంపు బాధుతులకు ఆదుకునేందుకు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీలు ఒక రోజు బేసిక్ పేను విరాళంగా ఇవ్వడంపై కొందరు జేఏసీ ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమను సంప్రదించకుండా , తమ అభిప్రాయం తీసుకోకుండా ఏక పక్షంగా ఎలా ప్రకటన చేస్తారని వారు జేఏసీ సంఘాల పెద్దలను ప్రశ్నిస్తున్నారు. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన 5 డీఏలు, 4 సరెండర్ లీవుల బిల్లులు, పీఆర్సీ గురించి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని వారు అడుగుతున్నారు.
తమకు ఉన్న ఆర్థిక సమస్యల గురించి మమ్మల్ని, వేతన బకాయిల గురించి ప్రభుత్వాన్ని ఏనాడు ప్రశ్నించని ఉద్యోగ సంఘాల నేతలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే జరిగేది ఉద్యోగులు మాత్రమే అని వారంతా వాపోతున్నట్లు తెలుస్తోంది. ముందుగా ప్రభుత్వం నుంచి తమకు న్యాయంగా రావాల్సిన వేతన బకాయిలపై కోట్లాడాలని పలువురు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఉద్యోగ సంఘాల జేఏసీ తరఫున వరద బాధితుల సహాయార్థం రూ.130 కోట్ల చెక్కును సీఎం రేవంత్ రెడ్డి జేఏసీ నేతలు అందించిన విషయం తెలిసిందే.