కరీంనగర్ బస్టాండ్ లో భారీ అగ్ని ప్రమాదం !

-

Huge fire accident in Karimnagar bus stand: కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో ఉన్న యూనియన్ బ్యాంక్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. నిన్న రాత్రి 11 గంటలకు బ్యాంకుల అగ్రి ప్రమాదం అంటూ తెలియడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించింది.

Huge fire accident in Karimnagar bus stand

బ్యాంకు లోపల దట్టమైన పొగ వ్యాపించడంతో మంటలు ఆర్పేందుకు అంతరాయం కలిగిందని అధికారులు చెబుతున్నారు. ఎగ్జాక్ట్ ఫ్యాను పైపు ద్వారా పొగను బయటికి పంపిస్తూ మంటలను అదుపు చేసినట్లు స్పష్టం చేశారు. కిటికీల ద్వారాలను పగలగొడుతూ గంటన్నర శ్రమించి మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంతో ఫైల్స్ కంప్యూటర్స్ ప్లాస్టిక్ లాంటివి కాలిపోవడం ఆస్తి నష్ట వివరాలను ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయంటూ అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version