వినియోగదారులకు అలర్ట్.. జీపే, ఫోన్‌పే, పేటీఎంలో కరెంటు బిల్లు కట్టవద్దన్న డిస్కం

-

తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు అలర్ట్. మీరు ఆన్లైన్లో కరెంట్ బిల్లు కడుతున్నారా? అది కూడా ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్‌ పే వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా బిల్ పే చేస్తున్నారా? అయితే ఇక నుంచి అలా చేయడం కుదరదు. ఎందుకంటే ఈనెల ఈ యాప్స్ ద్వారా విద్యుత్‌ బిల్లుల చెల్లింపులను నిలిపేశారు. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ-T.G.S.P.D.C.L  సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా ఈ విషయం వెల్లడించింది.

ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు జులై 1వ తేదీ నుంచి ఆయా సంస్థలు.. విద్యుత్‌ బిల్లుల చెల్లింపులను నిలిపివేసినట్లు దక్షిణ డిస్కం తెలిపింది. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపుల మాదిరిగానే ఆయా యాప్స్‌ విద్యుత్తు బిల్లుల చెల్లింపు సేవలు నిలిపేసినట్లు వెల్లడించింది. తమ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌లో కరెంటు బిల్లులు చెల్లించాలని దక్షిణ డిస్కం వినియోగదారులకు సూచనలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని డిస్కమ్‌లకు ఆర్బీఐ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. బిల్లుల చెల్లింపుల్లో సమర్థత, భద్రతకు పెద్దపీట వేసే చర్యల్లో భాగంగా బిల్లు చెల్లింపులన్నీ భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ద్వారానే జరగాలని ఆర్బీఐ నిర్దేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version