భార్య బతకదేమో అనే బెంగతో.. ఆసుపత్రి పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్న భర్త

-

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భార్య పరిస్థితి చూసి మానసికంగా కుంగిపోయి గాంధీ ఆసుపత్రి పై బిల్డింగ్ 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. చిలకలగూడ ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కనకల్ గ్రామానికి చెందిన సత్తవ్వ(47) ఏప్రిల్ 28న కడుపులో సమస్య తో గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఆమె భర్త కొమురయ్య(51) భార్య కోలుకోవడం లేదనే బెంగతో మానసికంగా కుంగిపోయారు.

పక్క బెడ్ లో వేరే పేషెంట్ చనిపోవడంతో తన భార్య కూడా బతకదేమో అనే బెంగతో బిల్డింగ్ పైనుండి దూకి చనిపోయినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు మృతుని కుమార్తె తండ్రి కనిపించడంలేదని వెతకడం తో ఏడు గంటలకు బిల్డింగ్ పైనుండి దూకి చనిపోయాడని ఆ విషయం తెలియడంతో ఆమె అక్కడికి వెళ్లి తన తండ్రిని చూసి బోరున విలపించింది. కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version