నో-హాంక్ సిటీగా హైద‌రాబాద్.. ఇష్ట రీతిన‌ హార‌న్ మోగిస్తే ఇక అంతే..!

-

హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రాన్ని నో – హాంక్ సిటీగా మార్చ‌డానికి పోలీసులు సిద్ధం అవుతున్నారు. అందుకు పోలీసు ఉన్న‌త అధికారులు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో ర‌హ‌దారుల‌పై వాహనాలతో ఇష్ట రీతిన హార‌న్లు మోగిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి సిద్ధం అవుతున్నారు. ముందున్న వాహ‌నాల‌ను కోసం ఇష్ట రాజ్యంగా హార్ల‌ను కొట్టినా… ఆస్ప‌త్రులు, పాఠ‌శాల‌ల వ‌ద్ద కూడా ఎక్కువ శ‌బ్ధం వ‌చ్చేలా హార‌న్లు కొట్టినా.. జ‌రిమానాలు విధించాల‌ని పోలీసులు నిర్ణ‌యం తీసుకున్నారు.

అలాగే ఎక్కువ శ‌బ్ధం వ‌చ్చేలా.. వాహ‌నాలు ఉన్నా.. చ‌లాన్లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు. అలాగే వాహ‌నాలు ఎంత వ‌ర‌కు హార‌న్లు ద్వారా శ‌బ్ధ కాలుష్యం చేస్తున్నాయో తెలుసుకోవ‌డానికి రాష్ట్ర పోలీసులు.. జ‌ర్మనీ నుంచి ప్ర‌త్యేక సాంకేతికత‌ను తీసుకువ‌స్తున్నారు. ఈ సాఫ్ట్ వేర్ శ‌బ్ధాన్ని ప‌సిగ‌ట్ట‌డ‌మే కాకుండా.. వాహ‌నం నెంబ‌ర్ ప్లేట్ ను కూడా ఫోటో తీస్తుంది. దీంతో చ‌లాన్లు వేయ‌నున్నారు. ఇలా త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ ను నో – హాంక్ సిటీ మార్చుతామ‌ని పోలీసులు ఉన్న‌త అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version