హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ రోడ్డు వైపు వెళ్తుండగా డివైడర్ పై దూసుకువెళ్ళి కరెంట్ ఫోల్ ఢీ కొట్టింది కారు. TS07UM1936 టాటా జీబ్రా కారు నడుపుతున్న డ్రైవర్ నిద్ర మత్తులోకి వెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నారు.
ఓ సాఫ్ట్వేర్ కంపెనీ చెందిన ఎంప్లాయిస్ నీ కారులో లాగిన్ తీసుకువెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారంతా సేఫ్ గా ఉన్నారు. డ్రైవర్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు పోలీసులు. జీరో % ఆల్కహాల్ గా నిర్ధారణ అయింది. కారును డివైడర్ నుంచి తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు.
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం
ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో అతి వేగం వల్ల అదుపు తప్పి డివైడర్ వద్ద ఉన్న పోల్ ను ఢీకొట్టిన కారు..
నైట్ షిఫ్ట్ ఉద్యోగులను గమ్యస్థానాలకు చేర్చే క్యాబ్ గా గుర్తింపు
పరారైన డ్రైవర్.. కేసు నమోదు pic.twitter.com/NbU3Scv3jJ
— Telugu Scribe (@TeluguScribe) November 19, 2024