రంజాన్‌ నెలలోనూ బిర్యానీనే టాప్‌.. హైదరాబాద్‌లోనే అత్యధిక ఆర్డర్లు

-

భారత్ లో బిర్యానీకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తెలంగాణలో.. అది కూడా హైదరాబాద్ బిర్యానీ. ప్రపంచ దేశాల అగ్రనేతలు, సినీ తారలు కూడా హైదరాబాద్ బిర్యానీకి ఫిదా అయ్యారు. ఇక వీకెండ్ వచ్చినా.. పండుగ అయినా.. పార్టీ అయినా బిర్యానీ ఉండాల్సిందే. అందుకే ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లలో బిర్యానీదే అత్యధిక ఆర్డర్లు ఉంటాయి. ఇక ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్‌ నెలలోనూ ఈ వంటకం మరోసారి టాప్‌లో నిలిచింది.

దేశవ్యాప్తంగా ఒక్క నెలలోనే 60 లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ వెల్లడించింది.  మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 8 వరకు వచ్చిన ఆర్డర్ల ఆధారంగా రూపొందించిన జాబితాను విడుదల చేసింది. సాధారణ నెలలతో పోలిస్తే ఈ సంఖ్య 15 శాతం అధికమని తెలిపింది. ఇందులో రంజాన్‌ మాసంలో ఒక్క హైదరాబాద్‌ నుంచే 10 లక్షల ఆర్డర్లు అందుకున్నట్లు పేర్కొంది. 5.3 లక్షల హలీమ్‌ ప్లేట్లు ఉన్నాయని, వాటిలో.. చికెన్‌ బిర్యానీ, హలీమ్‌, సమోసా అగ్రస్థానంలో నిలిచాయని వెల్లడించింది. ముఖ్యంగా ఇఫ్తార్‌ సమయంలో ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లు 34 శాతం పెరిగినట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version