పెళ్లికి ఒప్పుకోలేదని.. కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య

-

హైదరాబాద్‌ లో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడితో పెళ్లికి ఒప్పుకోలేదని కేబుల్ బ్రిడ్జి మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక గుల్బర్గా చించోలిలోని సాధిపూరకు చెందిన పాయల్ (20) ఆరు నెలల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో హౌస్ కీపింగ్ పని చేస్తుంది.

తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పగా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో పాయల్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకింది. డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా గురువారం రాత్రి వరకూ ఆమె ఆచూకీ లభించలేదు. అయితే.. ఇవాళ ఉదయం పాయల్ మృత దేహం లభ్యమైనట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news