మానవులకూ బర్డ్‌ఫ్లూ ముప్పు.. WHO హెచ్చరిక

-

ఇప్పటికే కరోనా వంటి మహమ్మారితో ప్రపంచమంతా గందరగోళానికి గురైన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల పాటు ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది. లక్షల్లో ప్రాణాలు బలయ్యాయి. కోట్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ మహమ్మారి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ పిడుగు లాంటి వార్త చెప్పింది. అదేంటంటే..?

కొంతకాలంగా క్షీరదాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు తరచూ వెలుగుచూస్తుండటంపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వైరస్ మనుషులకూ సోకేలా రూపాంతరం చెందే ముప్పు లేకపోలేదంటూ హెచ్చరించింది. సాధారణంగా ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు పక్షుల్లో వ్యాపిస్తాయి. అయితే వాటిలో ఒకటైన బర్డ్‌ఫ్లూ కారక హెచ్‌5ఎన్‌1 ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజాను ఇటీవలి కాలంలో క్షీరదాల్లోనూ గుర్తించారు. దాదాపు 10 దేశాల్లో ఆ కేసులు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే.. మనుషులకూ సులువుగా సంక్రమించేలా క్షీరదాల్లో ఈ వైరస్‌ రూపాంతరం చెందే ముప్పుందని డబ్ల్యూహెచ్‌వో బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కొన్ని క్షీరదాల్లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు కలగలిసి.. మానవులు, జంతువులకు హాని కలిగించే కొత్త వైరస్‌లు పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news