గచ్చిబౌలిలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేసారు పోలీసులు. ఇందులో మొత్తం 17 మంది విదేశీ యువతిలను పట్టుకున్నారు పోలీసులు. అలాగే ఈ విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను కూడా పట్టుకున్నారు. అయితే ఆన్ లెన్ వెబ్ సైట్ ద్వారా ఈ ముఠా వ్యభిచారం నిర్వహిస్తుంది. కానీ వీరు గుట్టును రట్టు చేసారు సైబరాబాద్ యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ పోలీసులు.
ఎవరికీ అనుమానం రాకుండా కొండాపూర్ లోని ఒక ఇండిపెండెంట్ హౌస్ లో ఈ వ్యభిచారం నడిపిస్తున్నారు. కెన్యా కి చెందిన 14 మంది, ఉగాండా కి చెందిన ఇద్దరు, టాంజానియా దేశానికి ఒక్క యువతిని అరెస్ట్ చేసారు పోలీసులు. అలాగే దీని నిర్వాహకుడు శివ కుమార్ తో పాటు మరో ఇద్దరు విటులను కూడా అరెస్టు చేశారు. లోకాంటో వెబ్సైట్ లో యువతుల ఫోటోలు పెట్టి విటులను ఆకర్షిస్తున్నాడు నిర్వాహకుడు శివకుమార్. గత కొన్నేళ్ల నుంచి విదేశీ యువతులతో ఈ వ్యభిచార గృహం శివకుమార్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.