హైదరాబాద్ మహానగరంలో మరోసారి వర్షం దంచి కొడు తోంది. గత 15 రోజులుగా వర్షం లేని హైదరాబాదులో ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. సోమాజిగూడ, ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, చింతల్, జగద్గిరిగుట్ట, శంషాబాద్, రాజేంద్రనగర్, నారాయణగూడ, హైటెక్ సిటీ, మల్కాజిగిరి ఉప్పల్ తదితర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తోంది.
ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు విరామం లేకుండా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలుపుతోంది. ఇక అటు తెలంగాణ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో… మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఇక వాతావరణ శాఖ చెప్పినట్లే ఇవాళ ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి.