హైదరాబాద్ నుంచి అయోధ్యకు వారంలో రెండే రైళ్లు.. టికెట్ల కోసం భక్తుల తిప్పలు

-

ఈ నెల 22వ తేదీన అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ మహత్తర కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని కళ్లారా వీక్షించాలని దేశవ్యాప్తంగా రామయ్య భక్తులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయోధ్యకు వెళ్లేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవం చూడాలనుకుంటున్న భాగ్యనగర భక్తులు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌ నుంచి వారంలో రెండు రైళ్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో టికెట్లు దొరకక తిప్పలు పడుతున్నారు. రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో నెల రోజుల పాటు ప్రత్యేక రైళ్లను నడపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

యశ్వంత్‌పూర్‌లో బయల్దేరి కాచిగూడ, సికింద్రాబాద్‌ మీదుగా వెళ్లే వీటిలో ఇప్పటికే సీట్లు నిండిపోయాయి. ప్రయాణ సన్నాహాల్లో ఉన్నవారు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి నేరుగా అయోధ్య వెళ్లేందుకు సుమారు 30 గంటల సమయం పట్టనుండగా.. తొలుత వారణాసి వెళ్లి అక్కడి నుంచి మరో రైలులో అయోధ్యకు చేరే అవకాశం ఉన్నప్పటికీ అదనంగా 6 గంటలు ప్రయాణించాలి. తిరుగు ప్రయాణానికీ మరో మార్గం లేని పరిస్థితి. ఫలితంగా అదనపు ఖర్చుతో పాటు 36 గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news