హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఆ మార్గాల్లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

-

హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ‘క్రిస్మస్‌ వేడుకలు’ నిర్వహించనుంది. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ఈ మార్గాల్లో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు

  • ఏఆర్‌ పెట్రోల్‌బంక్‌ కూడలినుంచి బషీర్‌బాగ్‌ బీజేఆర్‌ విగ్రహం కూడలి వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. నాంపల్లి లేదా రవీంద్రభారతి వైపు పంపిస్తారు. అబిడ్స్‌,
  • గన్‌ఫౌండ్రిల వైపునుంచి వచ్చే ట్రాఫిక్‌ను బషీర్‌బాగ్‌ బీజేఆర్‌ విగ్రహం కూడలి వైపు వెళ్లకండి. గన్‌ఫౌండ్రిలోని ఎస్‌బీఐ నుంచి సుజాతస్కూల్‌, చాపెల్‌ రోడ్డు వైపు(అవసరాన్ని బట్టి) పంపిస్తారు.
  • ట్యాంక్‌బండ్‌ నుంచి బషీర్‌బాగ్‌ కూడలి వైపు వచ్చే వాహనాలు లిబర్టీ జంక్షన్‌ నుంచి హిమాయత్‌నగర్‌ వైపు(అప్పటి పరిస్థితులను బట్టి) పంపిస్తారు.
  • మరోవైపు సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమం దృష్ట్యా ట్రాఫిక్‌ మళ్లింపులు
  • ఇవాళ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు లోతుకుంట టీ.జంక్షన్‌, ఎంసీఈఎంఈ సిగ్నల్‌, లాల్‌బజార్‌ టి.జంక్షన్‌, తిరుమలగిరి ఎక్స్‌రోడ్స్‌, సికింద్రాబాద్‌ క్లబ్‌ఇన్‌ గేట్‌ వద్ద ట్రాఫిక్ నిలిపివేత
  • టివోలి కూడలి, ప్లాజా ఎక్స్‌ రోడ్స్‌, సీటీఓ, ఎస్‌బీఐజంక్షన్‌, రసూల్‌పుర, పీఎన్‌టీ పైవంతెన, గ్రీన్‌ల్యాండ్‌, మోనప్ప కూడలి వద్ద ట్రాఫిక్ నిలిపివేత
  •  ఖైరతాబాద్‌ వీవీ విగ్రహం జంక్షన్‌ వద్ద, పంజాగుట్ట, ఎన్‌ఎఫ్‌సీఎల్‌, ఎన్టీఆర్‌ భవన్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టుల వద్ద ట్రాఫిక్‌ నిలిపివేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version