Hydra Demolitions in Musi catchment areas from today : హైడ్రా కూల్చివేతలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి మూసీ పరీవాహక ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు ప్రారంభం కానున్నాయి. మూసీ ఆక్రమణలపై ఫోకస్ పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మూసీ పరీవాహక ప్రాంతంలో 12 వేల ఆక్రమణలు గుర్తించారు అధికారులు.
మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాల తొలగింపు బాధ్యత హైడ్రాకు అప్పగించింది రేవంత్ రెడ్డి సర్కార్. మూసీ పరీవాహక నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించనుందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
అటు కూకట్ పల్లి, అమీన్ పూర్ లో కూల్చివేతలు జరుగుతున్నాయి. కూకట్ పల్లిలో అక్రమ నిర్మాణల పై హైడ్రా కొరడా విధిస్తోంది. నల్ల చెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయనున్నారు హైడ్రా అధికారులు. తెల్లవారుజామునే చేరుకున్న హైడ్రా సిబ్బంది… భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకుని..నల్ల చెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.