స్పీడ్ పెంచిన హైడ్రా.. దుండిగల్ లో విల్లాల కూల్చివేత

-

అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సేట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ టీమ్ ( హైడ్రా) కూల్చివేతలు శరవేగంగా కొనసాగుతున్నాయి. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. భారీ నిర్మాణాలను, బడా బాబుల విల్లాలను సైతం కూల్చివేస్తోంది.

తాజాగా మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ లో అక్రమంగా నిర్మించిన విల్లాను హైడ్రా కూల్చివేస్తోంది. ఆదివారం ఉదయమే అక్కడికి చేరుకున్న అధికారులు.. యంత్రాల సహాయంతో కూల్చివేతలు చేపట్టారు. ఇందులో ఎక్కువగా విల్లాలు ఉన్నాయి. స్థానికుల ఫిర్యాదుతో ఇటీవల హైడ్రా చీఫ్ రంగనాథ్ ఈ ఏరియాలో పర్యటించారు. మల్లంపేట్ కత్వా చెరువుకు సంబంధించిన ఎఫ్టిఎల్, బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు.

దీంతో ఆదివారం ఉదయం పోలీసు బలగాల భద్రత మధ్య, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేత పనులు మొదలయ్యాయి. ఈ కూల్చివేతలను స్వాగతించిన స్థానికులు.. దుండిగల్ లోని మిగతా చెరువులకు పట్టిన చెర విడిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు జిల్లాలకు సంబంధించిన యాజమానులు ఆందోళనకు దిగారు. నిబంధనల మేరకే తాము కొనుగోలు చేశామని చెబుతున్నారు. మరోవైపు మాదాపూర్, సున్నం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న అపార్ట్మెంట్స్ ను కూడా హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news