హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోంది.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పేరుతో హైడ్రామా నడుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ N కన్వెన్షన్ కూల్చివేతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  స్పందించారు. గతంలో అనుమతులు ఇచ్చినటువంటి ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు ప్రారంభించింది. ఇన్నాళ్లు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్ అక్రమ నిర్మాణాలపై ఉదాసీనంగా వ్యవహరించాయని పేర్కొన్నారు.

అక్రమ నిర్మాణాలకు రోడ్లు ఎందుకు వేశారు..? ఏ చర్యలైనా, చట్టమైనా అందరికీ సమానంగా వర్తింపజేయాలి. హైడ్రాతో ఎలాగైతే అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారో.. అలాగే మౌళిక అవసరాలకు అనుమతులు ఇచ్చిన వారి పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. మరోసారి కూల్చివేతలపై ప్రభుత్వం లోతుగా చర్చించి.. సమగ్రంగా అధ్యయనం చేసి ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏ చర్యలు అయినా.. చట్టం అయినా అందరికీ సమానంగా వర్తింపజేయాలని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version