చెరువుల ఆక్రమణపై మంత్రి పొన్నం ఫోకస్..!

-

రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై తనకు సమాచారం ఇవ్వాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను కోరారు. ప్రకృతి,పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యయానే సమాచారం స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. ఎంత పెద్ద వాళ్లు ఉన్న చెరువులు , కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారు అని తెలిపాడు.

ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్ తరాలకు ఇచ్చే వరం ఇది. చెరువులు ఆక్రమణకు గురైతే ఎంత పెద్ద వారైనా ఏ పార్టీ వారైనా ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయండి. ప్రభుత్వం ఎవరి మీద కక్ష పూరితంగా, వ్యక్తిగతంగా ఉద్దేశ్య పూర్వకంగా వ్యక్తుల మీద పార్టీల మీద జరుగుతున్న పోరాటం కాదు. ప్రభుత్వం పరివర్తన తేవాలని చేస్తున్న చర్య. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో తీసుకున్న చర్య అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version