మంత్రి కొల్లు రవీంద్ర పై పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.  గత ఏడాది నవంబర్ నుంచి అరెస్టు చేస్తానంటూ మొరుగుతున్నావు.  నీ అరెస్టుల వల్ల నా చేతి మీద రోమాలు కూడా ఊడవు.  అరెస్టులకు భయపడేది లేదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ నేతలతో పాటు వారి భార్యల కి సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు. రమేష్ హాస్పిటల్స్ వద్ద 17 మంది కానిస్టేబుళ్లతో ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు. మీ తప్పులకు కచ్చితంగా శిక్ష పడుతుందని ఆయన హెచ్చరించారు. అంతకు ముందు విజయవాడ జైలు వద్ద పేర్ని నాని, వల్లభనేని వంశీ బార్య పంకజ శ్రీ హల్ చల్ చేసారు. వంశీతో ములాఖత్ కోసం వస్తే జైలు సిబ్బంది అడ్డుకుంటున్నారంటూ వారు ఆందోళన చేశారు. జైలు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కొద్ది సేపటి తరువాత వారిని జైలు లోపలికి అనుమతించారు.

Read more RELATED
Recommended to you

Latest news