బాల్క సుమన్ మంత్రి అయితే అద్భుతాలు చేస్తారు : మంత్రి కేటీఆర్

-

అరవై ఏళ్లలో ఏమి చేయని కాంగ్రెస్, ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అంటూ వస్తోందని పురపాలక మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లాలో రూ.313 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మందమర్రిలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తో కలిసి రోడ్డు షోలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. ఆ తరువాత జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.

 

గతంలో ఓయూ విద్యార్థిగా ఉన్న బాల్క సుమన్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. నియోజకవర్గానికి మంత్రులుగా ఉన్న వాళ్లు చేయని పనులను సుమన్ చేసి చూపించారని కొనియాడారు. భవిష్యత్ లో ఆయన మంత్రి అయితే ఇంకా అద్భుతాలు చేస్తారని పేర్కొన్నారు. మొండి చేయి పార్టీని, చెవిలో పువ్వు పెట్టే పార్టీని నమ్మవద్దని ప్రజలను కేటీఆర్ కోరారు. 150 ఏళ్ల కిందట నాటి కాంగ్రెస్ గ్యారెంటీ ఎప్పుడో తీరిపోయింది. కాంగ్రెస్ గెలిస్తే ఐదేళ్లకు ఐదుగురు సీఎంలు అవుతారు. సీఎంలుగా ఎవ్వరూ ఉండాలో కూడా ఢిల్లీ నుంచి కవర్ వస్తుందని వ్యాఖ్యానించారు మంత్రి కేటీఆర్. 

Read more RELATED
Recommended to you

Latest news